- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలగిరిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహం.. పోలీసుల ఆకస్మిక దాడుల్లో బయటపడ్డ సంచలనం!
తిరుమలగిరి మండల కేంద్రానికి సమీపంలో గల నాగారం మండలం ప్రగతి నగర్ జనగామ-సూర్యాపేట జాతీయ రహదారి పక్కన గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై ఇటీవల పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడులు సంచలనం రేపాయి.

దిశ,తిరుమలగిరి: తిరుమలగిరి మండల కేంద్రానికి సమీపంలో గల నాగారం మండలం ప్రగతి నగర్ జనగామ-సూర్యాపేట జాతీయ రహదారి పక్కన గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై ఇటీవల పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడులు సంచలనం రేపాయి. నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ పోలీసులు చేపట్టిన ఈ దాడుల్లో మైనర్ వయస్సు గల యువకులే విఠులుగా పట్టుబడినట్లు విశ్వసనీయ సమాచారం. సూర్యాపేట రోడ్డుకు ఆనుకొని ఉన్న ఓ రైస్ మిల్ పక్కన గల సొంత గృహంలో కొంతకాలంగా ఈ వ్యభిచార వ్యవహారం నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ గృహానికి వచ్చేవారిలో ఎక్కువగా తక్కువ వయస్సు గల యువకులే ఉన్నారని దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది.
దాడుల సమయంలో పోలీసులు కొంత మంది యువకులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి చరవాణులు, ద్విచక్ర వాహనాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, పట్టుబడ్డ వారిలో కొందరు యువకులు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కొంతమంది తాము విలేకరులమని చెప్పుకుంటూ ఈ వ్యభిచార గృహ నిర్వాహకుల నుంచి డబ్బులు దండుకున్నట్లు నిర్వాహక మహిళ ఆరోపించడం మరో కోణాన్ని బయటపెడుతోంది. ఈ వ్యవహారం మరింత విస్తృతంగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ, అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.






