- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఆవును చంపిన పెద్దపులి
మూగజీవాలపై పులి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలేరు మండలం శారజీపేట గ్రామంలో ఆవు పై పులి దాడి చేసి చంపేసింది.

దిశ, ఆలేరు : మూగజీవాలపై పులి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలేరు మండలం శారజీపేట గ్రామంలో ఆవు పై పులి దాడి చేసి చంపేసింది. గ్రామంలోని రైతు దూడల శ్రీధర్ కు చెందిన ఆవుగా బుధవారం అధికారులు గుర్తించారు. మంగళవారం ఆలేరు మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో పులి అడుగుజాడలు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మరుసటి రోజే శారజీపేట గ్రామంలో ఆవు పై దాడి చేసిన ఘటన నెలకొంది. రెండు రోజులుగా ఆలేరు మండలంలో పులి కదలికలు ఉండడంతో ప్రజలు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళ బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా రైతులు బావుల వద్దకు వెళ్లాలంటే ప్రాణభయంతో వణికి పోతున్నారు.ఏ వైపు నుండి పులి వస్తుందో తెలియక భయం భయంగా ప్రాణాలు అరచేతులు పెట్టుకొని మండల ప్రజలు గడుపుతున్నారు . గ్రామాల్లో భద్రత చర్యలు పెంచాలని,పులిని త్వరగా పట్టుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. మనుషుల ప్రాణాలు పోతేనే తప్ప స్పందించరా అని ప్రశ్నిస్తున్నారు.






