అనుముల మండలం లో 91.34 శాతం పోలింగ్

by Ratna Kumari |

దిశ, హాలియా : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరిగిన ఎన్నికల్లో అనుముల మండలంలో 91. 34% పోలింగ్ జరిగింది.

అనుముల మండలం లో 91.34 శాతం పోలింగ్
X

దిశ, హాలియా : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరిగిన ఎన్నికల్లో అనుముల మండలంలో 91. 34% పోలింగ్ జరిగింది. మొత్తం 24 గ్రామపంచాయతీలకు గాను నాలుగు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా.. పేరూరు గ్రామపంచాయతీ లో ప్రజలు ఎన్నికను బహిష్కరించారు. 19 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. మండలంలో మొత్తం 20349 ఓటర్లు ఉండగా.. 18587 ఇందులో పురుషులు ౯౦౮౩, మహిళలు 9503 ఓట్లు పోలవ్వ‌గా ఇతరులు ఒకటి పోలయ్యాయి. గ్రామాల వారీగా ఇబ్రహీంపేట 1612 కొత్తపల్లి 1543 కొట్టాల 717 చలమారెడ్డి గూడెం 827 హజారి గూడెం 1180 పగవానికుంట 771 పాలెం 943 రామడుగు 1029 చింతగూడెం 953 యాచారం 1342 కుపాస్ పల్లి 315 మారేపల్లి 1575 అన్నారం 616 ముక్కామల 808 పులిమామిడి 1406 తిమ్మాపురం 536 మదారి గూడెం 1088 వీర్లగడ్డ తండా 633 కొరివేని గూడెం 498 ఓట్లు పోలైనట్లు మండల అభివృద్ధి అధికారి సుజాత తెలిపారు. మండలంలో మొత్తం 24 గ్రామపంచాయతీలకు గాను నాలుగు గ్రామపంచాయతీలు నాయుడుపాలెం, శ్రీనాధపురం, పంగవాని కుంట తండా, కాశవారిగూడెం గ్రామాలు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలు జరగలేదు. పేరూరు గ్రామపంచాయతీ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు.

Next Story