- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోచంపల్లిలో 93.11 శాతం పోలింగ్
దిశ, భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు శివారెడ్డిగూడెం గ్రామపంచాయ

దిశ, భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు శివారెడ్డిగూడెం గ్రామపంచాయతీ ఏకగ్రీవం కాగా మిగతా 20 గ్రామపంచాయతీ ఎన్నికలలో పోలింగ్ సమయం ముగిసే సరికి 93.11 శాతం ఓట్లు నమోదు అయినట్లు ఎంపీడీవో భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 27,497 ఓటర్లకు గాను పురుషులు 12,412, స్త్రీలు 12,625 మొత్తం 25,037 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగినట్లు పేర్కొన్నారు.
ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పూర్ గ్రామంలో గల ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ పేపర్లను, ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పగడ్బందీగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.






