- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8 కిలోల ఇంటి గంజాయి పట్టివేత
గుట్టు చప్పుడు కాకుండా ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న నిషేధిత గంజాయిని మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసులు బుధవారం పట్టుకున్నారు.

దిశ, మరిపెడ : నిషేధిత గంజాయిని విక్రయించిన, తరలించిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, మండల వ్యాప్తంగా నిషేధిత కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచామని మరిపెడ సిఐ రాజకుమార్ అన్నారు. బుధవారం మరిపెడలో పట్టుబడిన ఎండుగాంజాయి కి సంబంధించిన కేసు వివరాలను మరిపెడ పోలీస్ స్టేషన్ లో ఆయన వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ హతిరామ్, సిబ్బంది మరిపెడ అదనపు ఎస్సై కోటేశ్వరరావు వారి సిబ్బందితో కలిసి మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని రాజీవ్ గాంధీ సెంటర్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై యువకులు కనపడటంతో వారిని ఆపి తనిఖీ చేయడం జరిగింది. వారి వద్ద ఉన్న బ్యాగులో ఎండు గంజాయి సుమారు 8 కిలోలు ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనంతరం వారిని విచారించగా మొత్తం ఐదుగురు యువకులు మరిపెడ కు చెందిన లునవత్ ప్రవీణ్ , బోడా కార్తీక్ , బాణోత్ శివ గార్ల మండలానికి చెందిన మూడు అభిషేక్, ఒక మైనర్ బాలుడు అంతా కలిసి.. విశాఖపట్నం ఆరకు నుండి గంజాయిని తీసుకొని రహస్యంగా గంజాయిని విక్రయించేందుకు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.4.20లక్షలు ఉంటుందన్నారు. వారి వద్ద నుంచి గంజాయి ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ నిమిత్తం తరలించినట్లు సిఐ తెలిపారు. గంజాయిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మరిపెడ సిబ్బంది ఉమ మహేశ్వర రావు , సాయి కిరణ్, నరేష్, శ్రీనివాస్ , గణేష్ , నాగేశ్వరరావును సీఐ అభినందించారు.






