కాంగ్రెస్ లో 8 మంది నాయ‌కులు స‌స్పెండ్

by Ratna Kumari |   (  Updated:2026-02-06 15:02:58  IST  )

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్న కాంగ్రెస్ నాయ‌కుల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు కాంగ్రెస్ సూర్య‌పేట జిల్లా అధ్య‌క్షులు గుడిపాటి న‌ర్స‌య్య ఉత్త‌ర్వులు జారీ చేసారు.

కాంగ్రెస్ లో 8 మంది నాయ‌కులు స‌స్పెండ్
X

దిశ, హుజూర్ నగర్ : మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్న కాంగ్రెస్ నాయ‌కుల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు కాంగ్రెస్ సూర్య‌పేట జిల్లా అధ్య‌క్షులు గుడిపాటి న‌ర్స‌య్య ఉత్త‌ర్వులు జారీ చేసారు.

స‌స్పెండ్ అయిన వారు :

1వ వార్డు నుండి తమ్మిశెట్టి రాము.

8వ వార్డు నుండి రాయల వెంకటేశ్వర్లు

12వ వార్డు నుండి అమరారపు ప్రవీణ్

12 వార్డు నుండి రణపొంగు ప్రతాప్

14వ వార్డు నుండి దగ్గుపాటి బాబురావు

19 వార్డు నుండి వల్లపుదాస్ కృష్ణ

19 వార్డు నుండి షేక్ సైదా

20 వార్డు నుండి చింతకాయల రాము

స‌స్పెండ్ అయిన వారంద‌రూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా రెబ‌ల్ గా పోటీ చేసే వారికి మ‌ద్ద‌తు అందిస్తున్న‌ట్టు గుర్తించి వారిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు.

రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసింది వీరే..

1.తమ్మిశెట్టి రాము సతీమణి నిర్మల 1వ వార్డు నుండి పోటీ

2.రాయల వెంకటేశ్వర్లు సతీమణి నందిని 8వ వార్డు నుండి పోటీ

3.అమరారపు ప్రవీణ్ 12వ వార్డు నుండి పోటీ..

4.రణపొంగు ప్రతాప్ సతీమణి జ్యోతి 12 వార్డు నుండి పోటీ.

5.దగ్గుపాటి బాబురావు సతీమణి కవిత 14వ వార్డు నుండి పోటీ.

6.వల్లపుదాస్ కృష్ణ 19 వార్డు నుండి పోటీ.

7.షేక్ సైదా 19 వార్డు నుండి రెబల్ అభ్యర్థి కృష్ణకు మద్దతు ఇవ్వడం.

8. చింతకాయల రాము 20 వార్డు నుండి పోటీ

Next Story