50 కేజీల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.. రేషన్ డీలరే సూత్రధారీ..?

by Bhanu |

దొడ్డు బియ్యమైన సన్నబియమైన దందా మాత్రం ఆగటం లేదు.

50 కేజీల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.. రేషన్ డీలరే సూత్రధారీ..?
X

దిశ, అనంతగిరి : దొడ్డు బియ్యమైన సన్నబియమైన దందా మాత్రం ఆగటం లేదు. ప్రభుత్వ లక్ష్యం నీరుగారిచే ప్రయత్నం జరుగుతుంది. సన్న బియ్యంతో చాలా కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. కానీ కొన్నిచోట్ల అక్రమార్కులు చేస్తున్న పనుల వల్ల ప్రభుత్వం లక్ష్యం పక్కదారి పడుతుంది. వివరాల్లోకెళితే అనంతగిరి మండలం గొండ్రియల గ్రామంలో... సుమారు 50 కిలోల సన్న బియ్యం అమ్ముతుండగా సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. గొండ్రియాల గ్రామానికి చెందిన డీలర్ భర్త యడ్లపల్లి నరసింహారావు 50 కేజీల సన్న బియ్యం గ్రామ సరిహద్దులో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని బుద్ధారం తండా గ్రామానికి చెందిన బాణావత్ సైదులు అమ్ముతుండగా సివిల్ సప్లై అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. దీనిపై సివిల్ సప్లై డిటి రామిరెడ్డి కొన్న వ్యక్తి, అమ్మిన వ్యక్తి, డీలర్ పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్ ఐ లింగారెడ్డి తెలిపారు. ఇటీవల ప్రభుత్వం సన్నబియ్యం అమ్మిన కొన్న కఠిన చర్యలు తీసుకుంటుంది.




Next Story