10 గ్రామాలకు రాకపోకలు బంద్‌

by velandi.Saikiran |

వర్షం కురిస్తే చాలు.. ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వదర ఉధృతి కారణంగా

10 గ్రామాలకు రాకపోకలు బంద్‌
X

దిశ, ఆత్మకూరు(ఎం) : వర్షం కురిస్తే చాలు.. ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వదర ఉధృతి కారణంగా కాజ్‌వేలను దాటి వారి స్వగ్రామాలకు చేరుకోలేని పరిస్థితి. పట్టించుకునే వారే కరువయ్యారు. వంతెనల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నా.. కనీస చర్యలు శూన్యం. చిన్నపాటి వర్షం కురిసి వరదలు వస్తే మండలంలోని కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచి రైతులు, ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కోవల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలోని మొరిపిరాల,మోదుగుగుంట,కల్వపల్లి,సింగారం, చిన్నగూడెం,కొరటికల్, ఇప్పల్ల, పల్లెపహాడ్, పోతిరెడ్డి పల్లి,రహీంఖాన్ పేట, ఉప్పలపహాడ్, మోదుబావిగూడెం,గ్రామాల రైతులకు చిన్నపాటి వర్షం వచ్చినా రాకపోకలు నిలిచిపోతాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story