కార్పొరేషన్‌గా నల్లగొండ మున్సిపాలిటీ?

by Gantepaka Srikanth |

నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారింది. కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీ మంగళవారం బిల్లును ఆమోదించింది.

కార్పొరేషన్‌గా నల్లగొండ మున్సిపాలిటీ?
X

దిశ, వెబ్‌డెస్క్‌: నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారింది. కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీ మంగళవారం బిల్లును ఆమోదించింది. జిల్లా కేంద్రమైన నల్లగొండ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్‌గా మారడం వల్ల పట్టణానికి నిధుల రాక పెరుగుతుందని, మౌళిక సదుపాయాలు మెరుగుపడతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సభ దృష్టికి తీసుకొచ్చారు. నకిరేకల్ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరారు. ఇదిలా ఉంటే.. నల్లగొండ మున్సిపాలిటీగా ఏర్పడనప్పుడు వార్షిక బడ్జెట్‌ కేవలం రూ.10వేలు మాత్రమే. పెరిగిన జనాభా కారణంగా ప్రస్తుతం మున్సిపాలిటీ రోజు రోజుకూ విస్తరిస్తూ వచ్చింది. రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా విపరీతంగా పెరిగింది. కార్పొరేషన్‌గా అప్‌ గ్రేడ్‌ చేసేందుకు రూ.20 కోట్ల వార్షికాదాయంతో పాటు 2 లక్షల జనాభా ఉంటే సరిపోతుంది. అయితే నల్లగొండకు రూ.40 కోట్లకు ఆదాయంతో పాటు 2.5 లక్షల జనాభా ఉండటంతో కార్పొరేషన్‌గా మార్చడం సులువు అయింది.

Next Story