అందెశ్రీకి నల్గొండ గద్దర్ స్వర నివాళి (వీడియో)

by Gantepaka Srikanth |

తెలంగాణ కవి, ప్రముఖ రచయిత అందెశ్రీ(AndeSri) అకాల మరణం సాహితీ లోకాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

అందెశ్రీకి నల్గొండ గద్దర్ స్వర నివాళి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కవి, ప్రముఖ రచయిత అందెశ్రీ(AndeSri) అకాల మరణం సాహితీ లోకాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి లాలాపేటలోని ఇంటికి తరలించారు. ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఫేమస్ సింగర్, నల్లగొండ గద్దర్‌గా పిలుచుకునే నర్సన్న అందెశ్రీ భౌతికాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అందెశ్రీకి నివాళిగా పాట పాడారు. ఈ పాట అక్కడున్న అందరినీ శోకసంద్రంలోకి నెట్టింది. మరోవైపు.. అందెశ్రీ మృతిపట్ల ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా రేబర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందెశ్రీ మరణ వార్త విని గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పల్లెటూరిలో పశువుల కాపరిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం.. అంచెలంచెలుగా ఎదిగి తమ గ్రామానికి సైతం ఎంతో పేరు తీసుకొచ్చిందని వారు స్మరించుకుంటున్నారు. వీడియో

Next Story