Ila Tripathi: చిన్నారి నిత్యకు అండగా నిలిచిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

by Ramesh Naini |

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం, అగమోత్కూర్ గ్రామానికి చెందిన చిన్నారి నిత్య జీవితంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.

Ila Tripathi: చిన్నారి నిత్యకు అండగా నిలిచిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
X

దిశ, డైనమిక్ బ్యూరో: నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం, అగమోత్కూర్ గ్రామానికి చెందిన చిన్నారి నిత్య (Nithya) జీవితంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తల్లి మరణంతోనే కష్టాల్లో మునిగిపోయిన నిత్య ఇటీవల తండ్రి, తమ్ముడు కెనాల్‌లో మునిగి మరణించడంతో పూర్తిగా అనాథగా మారింది. ఈ తీవ్ర విషాద సమయంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) మానవతా దృక్పథాన్ని ప్రదర్శించారు. చిన్నారి నిత్యకు అండగా నిలుస్తూ, ఆమెకు ధైర్యం చెప్పి భవిష్యత్తుపై విశ్వాసం కలిగించారు.

తాజాగా వేములపల్లి తహసీల్దార్ కార్యాలయంలో స్వయంగా హాజరైన కలెక్టర్ త్రిపాఠి, నిత్యకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఆమె చదువు కొనసాగించేందుకు, జీవితంలో ధైర్యంగా ముందుకు సాగేందుకు ప్రోత్సహించారు. జీవితంలో అత్యంత కఠిన సమయాల్లో కూడా మానవత్వం వెలుగులు విరజిమ్ముతుందని, నాయకత్వం అనేది కేవలం పరిపాలన కాదు.. కరుణ, సానుభూతి రూపంలో ప్రజల హృదయాలను తాకడం అని కలెక్టర్ త్రిపాఠి చర్య మరోసారి గుర్తు చేశారు. వివరాల కోసం క్లిక్ చేయండి..

Next Story