- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేడీ IASలకు అచ్చిరాని నల్లగొండ..! రెండేళ్లలో ఇద్దరు కలెక్టర్లు బదిలీ
నల్లగొండ జిల్లా కలెక్టర్ పోస్టు మహిళా ఐఏఎస్‌లకు అచ్చిరావడం లేదనే చర్చ జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: నల్లగొండ జిల్లా కలెక్టర్ పోస్టు మహిళా ఐఏఎస్‌లకు అచ్చిరావడం లేదనే చర్చ జరుగుతున్నది. అక్కడ లేడీ ఆఫీసర్లు ఎక్కువ కాలం పనిచేయడం కష్టమే అని ప్రచారం జరుగుతోంది. మిగతా జిల్లాల కంటే అక్కడ ‘టిపికల్’ పని పరిస్థితులు ఉండటంతో ప్రభుత్వ పెద్దలే షాక్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకే గుట్టుచప్పుడు కాకుండా మహిళా ఐఏఎస్‌లను బదిలీ చేస్తున్నారని టాక్ నడుస్తున్నది. ఊహించని బదిలీల కారణంగా జిల్లా అధికారులు, కీలక నేతలు సైతం షాక్‌లో ఉన్నట్టు సమాచారం.
సడన్ ట్రాన్స్‌ఫర్స్..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నల్గొండ జిల్లా కలెక్టర్లుగా ముగ్గురు అధికారులు పనిచేయగా, అందులో ఇద్దరు మహిళా ఆఫీసర్లు ఉన్నారు. వీరిలో దాసరి హరిచందన కేవలం ఆరు నెలల పాటు కలెక్టర్‌గా పనిచేశారు. తాజాగా బదిలీ అయిన ఇలా త్రిపాఠి దాదాపు 14 నెలల పాటు కొనసాగారు. వీరద్దరూ జిల్లాలో ఎక్కువ కాలం పనిచేయాలని ఆశించినా ప్రభుత్వ పెద్దలు మాత్రం అక్కడ సేవలు ‘ఇక చాలు’ అనే నిర్ణయానికి వచ్చి బదిలీ చేసినట్లు తెలుస్తున్నది. ఇదిలాఉండగా, సదరు లేడీ ఐఏఎస్‌ల బదిలీల వెనుక ‘బయటకు చెప్పలేని కారణాలు’ ఉన్నట్టు అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరు మహిళా ఐఏఎస్‌ల బదిలీ విషయంలో చివరి నిమిషం వరకు సర్కారులోని కీలక వ్యక్తులు సీక్రెట్ మెయింటేన్ చేసినా ఒక కామన్ పాయింట్ కనపడుతుందని టాక్. ఒకవేళ బదిలీ విషయం ముందే లీకైతే ఆ జిల్లాకు చెందిన కీలక నేతలు అడ్డుపడుతారని, అందుకే వారి బదిలీల విషయాన్ని సీక్రెట్‌గా ఉంచినట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
హరిచందనపై ఫిర్యాదులు
ఐఏఎస్ అధికారిణి హరిచందన పనిచేసిన కాలంలో రూలింగ్ పార్టీ లీడర్ల నుంచి పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. లీడర్లు అందరితో ఒకేలా వ్యవహరించకుండా.. కొందరికి మాత్రమే ఆమె ప్రయారిటీ ఇచ్చేవారని ఆరోపణలున్నాయి. ఆఫీసుకు వెళ్లిన ఎమ్మెల్యేలకు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వకుండా గంటల కొద్ది వెయిట్ చేయించేవారని విమర్శలొచ్చాయి. అదే కొందరు లీడర్లకు మాత్రం అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వడం, వారి పనులు పూర్తయ్యే వరకు ఫాలో అప్ చేయడం వంటి పలు ఫిర్యాదులు, కథనాలు ప్రభుత్వ పెద్దల వద్దకు చేరాయి. ‘ఆ ఫిర్యాదులు’ వినే ఓపిక లేకపోవడంతో కేవలం 6 నెలలకే ఐఏఎస్ హరిచందనను బదిలీ చేశారని టాక్.
ఇలా త్రిపాఠి బదిలీకి ఓ కీలక నేత కారణమా?
ఇలా త్రిపాఠి పనితీరుపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే రెస్పాండ్ అయ్యేవారని, అందరితో కలుపుగొలుపుగా ఉండేదని కితాబిచ్చారు. కానీ సడన్‌గా ఆమెను ఎందుకు బదిలీ చేశారో తమకు అంతుపట్టడం లేదని చెబుతున్నారు. జిల్లాకు చెందిన ఓ కీలక నేత తీరుతో విసిగిపోయిన ఆమె స్వయంగా తనను బదిలీ చేయాలని ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేయడం వల్లే ట్రాన్స్‌ఫర్ చేసినట్లు సెక్రెటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.






