- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Owaisi: నకల్ కర్నేకేలియే అకల్ చాహియే.. పాక్ పై ఒవైసీ సెటైర్
పాక్ ఆర్మీ చీఫ్ ఆ దేశ ప్రధానికి ఇచ్చిన ఫోటో బహుమతిపై ఒవైసీ సెటైర్లు వేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆపరేషన్ బన్యాన్ కు (Operation Banyan) సంబంధించినది అంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఆ దేశ అధ్యక్షుడు అసిమ్ మునీర్ ఇచ్చిన చిత్రపటం బహుమతిపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) సెటైర్ వేశారు. నకల్ కర్నేకేలియే అకల్ చాహియే అని ఎద్దేవా చేశారు. కువైట్‌లోని భారతీయ ప్రవాస భారతీయులతో ఇంటరాక్షన్ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. "నిన్న, పాక్ ఆర్మీ చీఫ్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఒక ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. ఈ తెలివితక్కువ జోకర్లు భారతదేశంతో పోటీ పడాలనుకుంటున్నారు. వారు 2019 చైనా ఆర్మీ డ్రిల్ ఫోటోను బహుమతిగా ఇచ్చుకుంటూ ఇది పాక్ విజయంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. పాకిస్తాన్ చేస్తున్న ప్రచారానికి తప్పుదారి పట్టవద్దని ప్రవాస భారతీయులకు ఒవైసీ సూచించారు. భారతీయ అధికారిక ప్రకటనలనే విశ్వసించాలన్నారు.
Next Story






