Naini Rajender: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి డ్రగ్స్ అలవాటు

by Gantepaka Srikanth |   (  Updated:2024-09-14 11:18:19  IST  )

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Naini Rajender: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి డ్రగ్స్ అలవాటు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని ఆరోపించారు. తక్షణమే ఆయనకు నార్కొటిక్ టెస్టులు చేయించాలని డిమాడ్ చేశారు. వ్యూహాత్మకంగానే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కౌశిక్ రెడ్డి ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. గాజులు, చీరలు పంపడం కాదు.. ముందు ఆయన కట్టుకొని తిరగాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వారికి చీర, గాజులు పంపించారు. చీర, గాజులు కొనుక్కొని, వాటిని వేసుకొని నియోజకవర్గాలలో పర్యటించాలంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. తాజాగా నాయిని రాజేందర్ స్పందిస్తూ.. పై వ్యాఖ్యలు చేశారు.

Next Story