ప్రొ.నాగేశ్వర్ వ్యాఖ్యల దుమారం.. పాశం యాదగిరికి తెలంగాణ జనసేన కౌంటర్

by Prasad Jukanti |

ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్దతుగా జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ జనసేన నేత సంపత్ నాయక్ ఘాటు కౌంటర్ ఇచ్చారు

ప్రొ.నాగేశ్వర్ వ్యాఖ్యల దుమారం.. పాశం యాదగిరికి తెలంగాణ జనసేన కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్‍గా మారాయి. నాగేశ్వర్‍పై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేయడం ఆయనను అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారంతో నాగేశ్వర్‍కు పలువురు తెలంగాణ రాజకీయ నాయకులు, మేధావులు, జర్నలిస్టులు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్‍లో తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన సీరియస్‍గా రియాక్ట్ అయింది. ఈ సమావేశంలో కొంత మంది వక్తలు పరుష పదజాలంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‍పై చేసిన వ్యాఖ్యలకు ఇవాళ టీజనసేన అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‍లో తెలంగాణ జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు.

కాటికి కాలిచాపిన వయసులో ఏం మాటలు:

జనసేన విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాననని ఇకపై దీనిపై మాట్లాడనని చెప్పిన ప్రొ.నాగేశ్వర్ కొంత మంది చిల్లర బ్యాచ్‍తో ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారని మిస్టర్ నాగేశ్వర్ రావ్ ఖబర్దార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జర్నలిజం పేరుతో పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హననం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్వీ రాజ్ యాదవ్ ఉపయోగించే భాష ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలివి ఉండి మాట్లాడతున్నారా లేక తెలివి లేక మాట్లాడుతన్నాడా అని పరుష పదజాలంతో రెచ్చిపోయాడు. నిన్న ఎవడు వస్తాడో రండి అని అన్నారు. ఇవాళ నేను వచ్చాను. తొక్కుతామంటూ హెచ్చరించాడు. ఇండి విజువల్ జర్నలిజం పేరుతో తులసిచందు సోయి ఉండి మాట్లాడుతున్నారా సోయి లేకుండా మాట్లాడుతున్నారా అని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్‍పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాశం యాదగిరికి బుద్ధుండాలి కదా. ఏం మనిషివిరా నువ్వు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాటికి కాలిచాపిన వయసులో ఏం మాట్లాడుతున్నావ్ అంటూ రెచ్చిపోయాడు. పవన్ కళ్యాణ్ ఐదు పెళ్లిళ్లు చేసుకుంటే నువ్వు కూడా చేసుకో నిన్నేవరు వద్దన్నారు అంటూ మండిపడ్డారు. బక్క జడ్సన్ కంటే ఎక్కువ బూతులు మాట్లాడగలను అంటూ హెచ్చరించారు.

Next Story