- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
14ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం.. క్లారిటీ ఇచ్చిన నా అన్వేషణ
అన్వేష్‌కు వావివరసలు ఉండవని 14ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలు చేశారు. అతడిపై ఫోక్సో కేసు పెట్టాలని మండిపడ్డారు. అయితే తాజాగా అన్వేష్ ఆ ఇష్యూపై స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ శివాజీపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ అతడిని బూతులు తిట్టిన అన్వేష్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చాలా మంది అన్వేష్ ను అన్ ఫాలో చేశారు. అంతే కాకుండా అన్వేష్‌కు వావివరసలు ఉండవని 14ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలు చేశారు. అతడిపై ఫోక్సో కేసు పెట్టాలని మండిపడ్డారు. అయితే తాజాగా అన్వేష్ ఆ ఇష్యూపై స్పందించారు.
వెనెజులాలో చేసిన వీడియోపై అసత్య ప్రచారం చేశారని అన్నారు. తాను 14ఏళ్ల అమ్మాయి వ్యభిచారం చేస్తుంటే ఆమెకు భోజనం పెట్టించి, వారి తండ్రి అనారోగ్యంతో ఉంటే మందులు కొనిచ్చానని చెప్పాడు. ఆ అమ్మాయి తనకు చెల్లితో సమానం అని అన్నాడు. అంతే కాకుండా ఆ వీడియో తన వెనెజులా సిరీస్ లో ఉందని కావాలంటే వెళ్లి చూడాలని చెప్పాడు. కావాలనే తన పరువు తీశారని అన్ ఫాలో చేసినవాళ్లతోనే తన దరిద్రం పోయిందని అన్నాడు. చెల్లితో అక్రమసంబంధం అంటగట్టిన నీచులు అని మండిపడ్డాడు. అంతే కాకుండా తనకు ఇప్పటికీ 70 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని వాళ్లు సరిపోతారని చెప్పాడు.






