కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారు - మైనంపల్లి

by velandi.Saikiran |

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumanth Rao) హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారు - మైనంపల్లి
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumanth Rao) హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే కోవర్టులు ఉన్నారని బాంబు పేల్చారు. తాజాగా మీడియాను అడ్రస్ చేశారు మైనంపల్లి హనుమంతరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మా కాంగ్రెస్ పార్టీలోనే కోవర్టులు ఉన్నారని తెలిపారు.

వాళ్లు దొరికిన రోజు... విప్పి కొడతానంటూ హెచ్చరించారు. కొంత మంది డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అలాంటి వారిని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా... అమ్ముడుపోయే నాయకులను మాత్రం వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు మైనంపల్లి హనుమంతరావు.

అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయంపై కూడా స్పందించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ తో సంసారాలు నాశనం చేశారని ఆగ్రహించారు. తనతో పాటు భార్య, కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపణలు చేశారు. భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాప్ చేశారని కూడా పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Next Story