Marwadi Go Back: మార్వాడీ గో బ్యాక్‌ లొల్లి..! మైనంపల్లి హన్మంతరావు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

మార్వాడీ గో బ్యాక్ పై కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్పందించారు.

Marwadi Go Back: మార్వాడీ గో బ్యాక్‌ లొల్లి..! మైనంపల్లి హన్మంతరావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా (Marwadi Go Back) 'మార్వాడీ గో బ్యాక్' లొల్లీ నడుస్తున్న విషయం తెలిసిందే. మార్వాడీ వ్యాపారాలతో స్థానికుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయన్న కారణంతో రాష్ట్రంలో స్థానిక వ్యాపారులు గో బ్యాక్ ఉద్యమం చేపట్టారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao) స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మనమంతా భారతీయులం, ఎక్కడైనా జీవించవచ్చని అన్నారు. మన కుటుంబ సభ్యులతో మనం పంచాయితీ పెట్టుకోవడం సరికాదని సూచించారు. ఎవరినీ కించపర్చొద్దు, తక్కువ చేయొద్దు.. అందరికీ సత్తా ఉందన్నారు. మన సత్తాను అమెరికా, పాకిస్తాన్ లాంటి దేశాలకు చూపించాలి కానీ మనలో మనం కొట్లాడుకోకూడదని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ అందరికీ వెల్కమ్ చెబుతుందని, విదేశాల వారికి కూడా సిటీ వెల్కమ్ చెబుతోందన్నారు. మన సత్తా హైదరాబాద్ డెవలప్‌మెంట్‌లో చూపించాలని, ప్రపంచంలోనే హైదరాబాద్ పేరు అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.

Next Story