Mayanmar Earthquake :మయన్మార్ భూకంపం.. తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

by Muthe.Rajitha |

మయన్మార్, బ్యాంకాక్ లో శుక్రవారం భారీ భూకంపం(Thailand Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే.

Mayanmar Earthquake :మయన్మార్ భూకంపం.. తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం
X

దిశ, వెబ్ డెస్క్ : మయన్మార్, బ్యాంకాక్ లో శుక్రవారం భారీ భూకంపం(Thailand Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. వరుసగా మూడుసార్లు వచ్చిన భూకంప ధాటికి పలు ఎత్తైన భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. కూలిపోతున్న భవనాలు, భయంతో పరుగులు తీస్తున్న జనంతో కూడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 55 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించగా.. వందలాది మంది గల్లంతైనట్టు తెలిపింది. కాగా బ్యాంకాక్ పర్యటనకు వెళ్ళిన తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే(Telangana MLA) కుటుంబం భూకంప ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారని సమాచారం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్(Ramagundam MLA Raj Thakur) కుటుంబం బ్యాంకాక్ విహార యాత్రకు వెళ్ళగా.. శుక్రవారం బ్యాంకాక్ లో సంభవించిన భారీ భూకంపం నుంచి క్షేమంగా బయటపడ్డారు.

రాజ్ ఠాకూర్ భార్య, అల్లుడు, కూతురు బ్యాంకాక్ లో వారు దిగిన హోటల్ లో నుంచి సురక్షితంగా బయటపడగా.. ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారంతా విమానాశ్రయంలో ఉన్నారని ఎమ్మెల్యే సన్నిహితులు తెలిపారు. కాగా నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హైదరాబాద్ లోనే ఉండిపోగా.. ఆయన కుటుంబం అంతా విహారయాత్రలో ఉన్నారు. అయితే ప్రస్తుతం థాయ్ లాండ్ లో ఎమర్జెన్సీ విధించడం వలన ఎయిర్పోర్టులు మూసి వేయడంతో వారు హైదరాబాద్ రావడానికి సమయం పట్టవచ్చని తెలుస్తోంది.

Next Story