తెలంగాణలో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 85వ సదస్సు

by Muthe.Rajitha |

తెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ వార్షిక సదస్సును వచ్చే ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

తెలంగాణలో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 85వ సదస్సు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ వార్షిక సదస్సును వచ్చే ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి... కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు.

85వ సదస్సు తెలంగాణలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అవకాశం కల్పించాలని లేఖలో కోరారు. ఈ సదస్సు నిర్వహణకు కేంద్ర అంగీకారం కోసం మంత్రి నిరంతర సంప్రదింపులు చేశారు. సానుకూలంగా స్పందించిన నితిన్ గడ్కరీ... శుక్రవారం భువనేశ్వర్ లో జరుగుతున్న 84వ ఐఆర్సీలో ఈ మేరకు ప్రకటన చేశారు. 2026 సదస్సు హైదరాబాద్ లోనే జరగనున్నట్లు తెలిపారు.

సదస్సు నిర్వహణతో రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు ప్రయోజనం చేకూరనుందని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర మంత్రి గడ్కరీ, కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటికప్పుడు తమ సూచనల మేరకు సదస్సు నిర్వహణపై మానిటరింగ్ చేసిన ఆర్ అండ్ బి ఈఎన్సీ మోహన్ నాయక్, ఇతర అధికారులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

Next Story