ఢిల్లీకి చేరుకున్న మయన్మార్ సైబర్ ఫ్రాడ్ బాధితులు

by Muthe.Rajitha |

మయన్మార్ మయవాడీలోని సైబర్ నేరాల శిబిరాల్లో చిక్కుకున్న రాష్ట్ర పౌరులు శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు.

ఢిల్లీకి చేరుకున్న మయన్మార్ సైబర్ ఫ్రాడ్ బాధితులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మయన్మార్ మయవాడీలోని సైబర్ నేరాల శిబిరాల్లో చిక్కుకున్న రాష్ట్ర పౌరులు శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. భారత వైమానికదళ ప్ర్యతేక విమానంలో రాష్ట్రానికి చెందిన 11మంది బాధితులు సురక్షితంగా చేరుకున్నారు. వారిని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు గ్రేటర్ నోయిడాలో సంబంధిత రాష్ట్ర అధికారులకు అధికారికంగా అప్పగించారు. విచారణ ధృవీకరణ అనంతరం తెలంగాణకు చెందిన వారిని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులకు అప్పగించారు.

హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ తో పాటు పలు జిల్లాల వారు ఈ బృందంలో ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపారు. వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ తరలించేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేశారు. శనివారం తెల్లవారు జాము వరకు హైదరాబాద్ చేరుకోన్నారు.

Next Story