- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP అభ్యర్థికి ఓటేసిన టీచర్లకు నా సెల్యూట్: బండి సంజయ్
by Satheesh |
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారథ్య ఫలితమేనని మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ఏవీఎన్ రెడ్డి అన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారథ్య ఫలితమేనని మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ఏవీఎన్ రెడ్డి అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బండి సంజయ్‌ను కలిశారు. కాగా ఆయన్ను బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావును బండి సంజయ్ అభినందించారు. సమష్టి కృషి ఫలితమే ఈ గెలుపు అని బండి సంజయ్ అన్నారు. బీజేపీ అభ్యర్థికి ఓటేసిన టీచర్లందరికీ తన సెల్యూట్ అని బండి వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా ఈ గెలుపును అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి.
Next Story






