- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్జాతీయ ప్రమాణాలతో ఓయూని తీర్చి దిద్దాలన్నదే నా సంకల్పం: సీఎం రేవంత్ రెడ్డి
గతంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఇందులో భాగంగా ఓయూ అభివృద్ధికి రూ. 1000 కోట్లు కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: గతంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఇందులో భాగంగా ఓయూ అభివృద్ధికి రూ. 1000 కోట్లు కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు. "సర్వం సిద్ధం" పేరుతో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. వర్సిటీ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో అధికారులు ఇప్పటికే సిద్ధం చేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1 తర్వాత ఓయూలోని ఆర్ట్స్ కళాశాల ముందు ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దాలన్నదే తన సంకల్పమని, అణిచివేతకు గురైనప్పుడు పోరాటం పుడుతుందని అన్నారు. దండకారణ్యంలో పుట్టిన కొమురం భీం చదువుకోలేదు.. ఆనాడు ఆధిపత్యం చెలాయించిన వారిపై కొమురం భీం ఉద్యమాన్ని రగిలించారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఆరు దశాబ్దాలు ఎదురు చూశామని, ఓయూలోనే తొలి దశ ఉద్యమం పుట్టిందని, ఆ ఉద్యమం ఫలించకపోవడంతో విద్యార్థులు అటవి బాట పట్టారని, బడికి వెళ్లని అందెశ్రీ తెలంగాణ ఉద్యమ గేయాన్ని రచించారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
తాను యూనివర్సిటీకి వచ్చే ముందు.. ఓయూలో మంత్రులు, సీఎంలను అడ్డుకునే చరిత్ర ఉంది. మీరు ఎందుకు వెళ్తున్నారని తనను అడిగారు.. తాను చాలా ధైర్యం చేస్తున్నానని కొందరు అన్నారు. నాది ధైర్యం కాదు, అభిమానం.. నా తమ్ముళ్లు ఉన్న యూనివర్సిటీకి వెళ్లేందుకు ధైర్యం అవసరమా.. గుండెల నిండా అభిమానంతో భవిష్యత్ ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చాను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. అలాగే ప్రభుత్వ బడిలో చదివిన తనరకు పేదలకు ఏం కావాలో తెలుసని, తెలంగాణ వచ్చాక విద్యార్థులేవరూ ఫామ్ హౌస్‌లు, ఆస్తులు ఆడగలేదని, స్వేచ్ఛ, సమాన అవకాశాలు మాత్రమే విద్యార్థులు ఆశించారు కానీ ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొందరు కుట్రలు చేశారని, అందుకు విద్యార్థులు ప్రజా పాననను తెచ్చుకున్నారని సీఎం స్పష్టం చేశారు.
తనను ఆర్ట్స్ కాలేజీ దగ్గరకు వెళ్లానని ఒకాయన సవాల్ చేశారని, ఆయన లాగా తాను దొంగను కాదని, తనకు ఫామ్ హౌస్ లు లేవని, ప్రజలు గుండెల్లో పెట్టుకుని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ సీఎంగా వచ్చానని, ఇంతకంటే గొప్ప అవకాశం ఎవరికైనా వస్తుందా అని ఈ సందర్భంగా సీఎం ప్రశ్నించారు. అలాగే కుల గణన ద్వారా వందేళ్ల సమస్యకు పరిష్కారం చూపామని, అభివృద్ధి అంటె అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని, సామాజిక సమస్యలకు పరిష్కారం, సంక్షేమం ద్వారా అభివృద్ధి సాధ్యం అవుతుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్రంతో పాటు, దేశంలో విద్య అందుబాటులో ఉన్నప్పటికీ, నాణ్యమైన విద్య కొరత ఉందని ఓయూ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాలు (Skills) లోపించడంపై ప్రధానంగా దృష్టి సారించామని చెప్పుకొచ్చారు. "మనకు ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన విద్యార్థులకు కొదవలేదు, కానీ వారిలో సరైన నైపుణ్యం ఉండటం లేదని, ఇంజినీరింగ్ విద్యార్థులకు సర్టిఫికెట్ మాత్రమే ఉంటుంది, నైపుణ్యం ఉండట్లేదని, అలాంటి పరిస్థితులను మార్చేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో స్కీల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.






