- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకున్నది.. జగ్గారెడ్డి ఎమోషనల్ కామెంట్స్
కులం పేరు చెప్పుకుని తాను రాజకీయాల్లోకి రాలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్/సంగారెడ్డి బ్యూరో: కులం పేరు చెప్పుకుని తాను రాజకీయాల్లోకి రాలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. ఇవాళ సంగారెడ్డిలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ (Meenakshi Natarajan) ఆదేశాల మేరకు ‘ఓట్ చోరీ’పై సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. గెలుపోటములు తనను ఏనాడు ప్రభావితం చేయలేదని జగ్గారెడ్డి అన్నారు.
ఓడిన నాడు ఏడ్వలేదని.. గెలిచిన నాడు ఎగిరి గంతులేయలేదని.. నిత్యం ప్రజల వెంటే ఉన్నాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణం అంతా కష్టాలతో కూడకున్నదని ఎమోషనల్ అయ్యారు. రాత్రుళ్లు పార్టీ జెండాలు కట్టి, పగటిపూట ధర్నాలు చేసి ఎదిగిన చరిత్ర తనదని అన్నారు. తాను జనం నుంచి వచ్చిన మనిషినని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. అధికారం కోసం ఆ పార్టీలో వాళ్లకు వాళ్లే కొట్లాడుకుంటున్నారని అన్నారు. నా రివ్యూలకు వచ్చే అధికారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నతాధికారులు ఏమైనా అంటే తన పేరు వాళ్లకు చెప్పాలని కింది స్థాయి అధికారులతో జగ్గారెడ్డి అన్నారు.






