MP Laxman : నా ఫోన్ కూడా ట్యాప్ అయి ఉండవచ్చు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌

by Muthe.Rajitha |

బీజేపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్(MP Laxman) తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

MP Laxman : నా ఫోన్ కూడా ట్యాప్ అయి ఉండవచ్చు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్(MP Laxman) తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. తన ఫోన్ కూడా ట్యాప్ చేయబడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2016-2020 మధ్య తాను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిత్తశుద్ధితో ఉంటే ఈ విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని సవాలు విసిరారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్‌లో రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని, ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఘటన అని మండిపడ్డారు.

అరెస్టయిన పోలీసు అధికారుల వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్‌(KCR)ను ప్రధాన నిందితుడిగా చేర్చాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవిపై లక్ష్మణ్ స్పందిస్తూ.. జూలై రెండో వారంలో కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారని, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడిని నియమిస్తారని, పార్టీలో పాత, కొత్త నాయకుల మధ్య ఎలాంటి భేదం ఉండదని తెలిపారు.

బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకోవాలని తెలిపిన ఎంపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కుల గణనలో 90% ముస్లింలను బీసీలుగా చేర్చడం వల్ల నిజమైన బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీ సామాజిక వర్గాల హక్కులను దెబ్బతీశాయని విమర్శించారు.

Next Story