- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంత ఊరోళ్లే నా గుండెల మీద కొట్టారు.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఎమోషనల్
రాష్ట్రంలో రెండో విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రెండో విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. అయితే, ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో మాత్రం సంచలన ఫలితాలు నమోదు అవుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) స్వగ్రామం రంగారెడ్డిగూడలో అనూహ్యంగా బీజేపీ (BJP) అభ్యర్థి విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 972 ఓట్లు పోల్ అవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థి అంజలి (Anjali)కి 459 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతి (Revathi)కి 490 ఓట్లు వచ్చాయి. దీంతో రేవతి 31 ఓట్లతో విజయం సాధించినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.
అయితే, స్వగ్రామం రంగారెడ్డిగూడ (Rangareddyguda)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవడంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మొదటి సారి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జడ్చర్ల (Judcharla) నియోజకవర్గాన్ని తాను అభివృద్ధి చేసుకుంటూ పోతున్నానని అన్నారు. సొంత ఊరు రంగారెడ్డిగూడ అని చెప్పి ఊరును డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రూ.1.50 కోట్ల నిధులు తన చేతులతోనే మంజూరు చేశానని అన్నారు. కానీ, నన్ను అందరు కలిసి నమ్మించి సొంత ఊరోళ్లే సర్పంచ్ ఎన్నికల్లో తన గుండెల మీద కొట్టారని ఎమోషనల్ అయ్యారు. బయటి నుంచి వేరే పార్టీ నాయకులు రంగారెడ్డిగూడకు వచ్చి తన అభ్యర్థి ఓటమికి కుట్రలు చేశారని ఆరోపించారు. ఏది ఏమైనా జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి ఆగదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.






