- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Suddala Ashok Teja : తెలంగాణ తల్లి విగ్రహంలో మా అమ్మ కనిపించింది : సుద్దాల అశోక్ తేజా
రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy) అధికారికంగా ఆవిష్కరించి(Officially unveiled)న తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli statue) పట్ల మేధావులు, కవి, రచయితలు, కళాకారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy) అధికారికంగా ఆవిష్కరించి(Officially unveiled)న తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli statue) పట్ల మేధావులు, కవి, రచయితలు, కళాకారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసిన ప్రముఖ సినీ గేయ రచయిత...సాహితీవేత్త సుద్దాల ఆశోక్ తేజా(Suddala Ashok Teja) భావోద్వేగంతో స్పందించారు. సచివాలయంలో ఆవిష్కరించబడిన తెలంగాణ తల్లి విగ్రహంలో నాకు ముగ్గురమ్మల మూలపూటమ్మనో.. పెద్దమ్మనో.. దేవతనో కనిపించలేదని..నన్ను కన్న నా తల్లి జానకమ్మ కనిపించిందన్నారు. మా అమ్మనే కాదు..నా తోబుట్టువులు కనిపించారని., సాధారణ మధ్యతరగతి దిగువ కుటుంబాల ఒక రైతు వనిత కనిపించిందని..తెలంగాణ నేలమ్మ కనిపించిందని కితాబిచ్చారు.
అలాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి శిరసా ప్రమాణాలని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం ఫోటోను పాఠ్యపుస్తకాల్లోనూ ప్రదర్శించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే జయజయహే తెలంగాణ అధికారిక గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తుండగా, వందేమాతరం, జనగణమన సరసనా రాష్ట్ర అధికారిక గీతాన్ని కూడా ముద్రిస్తున్నారు.






