CM Revanth Reddy : నా కుటుంబ సభ్యులు పదవులు ఆశించడం లేదు : కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

నారాయణపేట(Narayanapeta) జిల్లా కోస్గి(kosgi) మండలం చంద్రవంచలో ఆదివారం జరిగిన రైతు భరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Athmiya Bharosa), ఇందిరమ్మ ఇళ్ళు(Indiaramma Houses), కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) పంపిణీ పథకాలను ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు.

CM Revanth Reddy : నా కుటుంబ సభ్యులు పదవులు ఆశించడం లేదు : కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : నారాయణపేట(Narayanapeta) జిల్లా కోస్గి(kosgi) మండలం చంద్రవంచలో ఆదివారం జరిగిన రైతు భరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Athmiya Bharosa), ఇందిరమ్మ ఇళ్ళు(Indiaramma Houses), కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) పంపిణీ పథకాలను ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కొడంగల్‌(Kodangal) నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా.. పరిష్కరించేందుకు నా సోదరుడు తిరుపతి రెడ్డి(Tirupathi Reddy) ఉంటారన్నారు. ఏ పదవి ఆశించకుండా తన.. ప్రజాసేవ చేస్తున్నారని, తన కుటుంబ సభ్యులకు పదవులు అవసరం లేదని తెలిపారు. కేసీఆర్‌లాగా కుటుంబ సభ్యులకు తాను పదవులు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. 13 నెలలైనా ప్రతిపక్ష నేత.. ఎందుకు అసెంబ్లీకి రావడం లేదని ప్రశ్నించారు. సర్పంచ్‌ ఊరిలో లేకుంటే.. పదవి వదిలిపెట్టమని అడుగుతామని మరి, ప్రతిపక్ష నేతను ఏమనాలని సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నామని అన్నారు. ప్రజలకు, రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని.. భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం.. రైతుకు కాంగ్రెస్ కు ఉందన్నారు.

Next Story