- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్లకు, అధికారులకు నా అభినందనలు.. సీఎం రేవంత్ స్పెషల్ ట్వీట్
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏ రోజు ఏం చేశారో ఆ మరుసటి రోజు తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును నిత్యం పర్యవేక్షించాలని వీసీలో సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే అధికారులు, కలెక్టర్లు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయికి వెళ్లి పాఠశాలలు, వసతి గృహాలు, అస్పత్రులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రేషన్ కార్డుల పంపిణీ, సంక్షేమ పథాకాలపై అమలుపై స్థానిక అధికారులను అడిగి తెలుసకుంటున్నారు.
అయితే, తాజాగా కలెక్టర్ల పనితీరు పట్ల తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రుల్లో వైద్య సేవలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సౌకర్యాలను వెళ్లి పరిశీలిస్తున్న కలెక్టర్లకు, ఇతర అధికారులకు నా అభినందనలు అని కామెంట్ చేశారు. ప్రతి గూడెం, తండా, మారుమూల పల్లెకు ప్రజాపాలన చేరాలని ఆంకాంక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందాలని.. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నా అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు..






