- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: ముషీరాబాద్ ఎమ్మెల్యే కొడుకు ముఠా జై సింహా అరెస్ట్..!
ముషీరాబాద్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కొడుకు ముఠా జై సింహా అరెస్ట్ అయ్యాడు. ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో డబ్బులు పంచుతుండగా పోలీసులు

దిశ, వెబ్‌డెస్క్: ముషీరాబాద్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్ కొడుకు ముఠా జై సింహా అరెస్ట్ అయ్యాడు. ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో డబ్బులు పంచుతుండగా పోలీసులు ఎమ్మెల్యే కొడుకును బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఠా జై సింహాకు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చిన ఆందోళన చేస్తున్నారు. ఇదిలా ఉంటే, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని గంటల మాత్రమే సమయం ఉంటడంతో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లకు జోరుగా మద్యం, మనీ పంపిణీ జరుగుతోంది. ఓటర్లను ప్రలోభా పెట్టేందుకు లీడర్లు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. డబ్బు పంపిణి చేస్తున్న వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.
అరెస్ట్ వార్తలపై స్పందించిన జై సింహా:
తాను అరెస్ట్ అయినట్లు వస్తోన్న వార్తలపై ముఠా జై సింహా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని.. అరెస్ట్ అయినట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, తన తండ్రికి వస్తున్న ఆదరణను తట్టుకోలేక ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తాను అరెస్ట్ అయినట్లు తప్పుడు వార్తలు ప్రసారం చేయిస్తున్నారని మండిపడ్డారు. అరెస్ట్ అయినట్లు వస్తోన్న వార్తలను నమ్మొద్దని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు.






