- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha: మూల్యం చెల్లించుకోక తప్పదు.. కవిత మరో ట్వీట్
కవిత మరోసారి సంచలన ట్వీట్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: పాలకుల మెప్పుకోసం పోలీసులు ప్రజలను ఇబ్బంది పెడితే మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయం గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) హెచ్చరించారు. యూరియా కొరతపై (Urea Shortage) ప్రశ్నించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన రైతు లక్ష్మణ్ యాదవ్ ఇంటికి పోలీసులు వెళ్లడంపై ఎక్స్ వేదికగా ఇవాళ కవిత స్పందించారు. యూరియా కొరతపై ప్రశ్నించడమే నేరమా? ఇందిరమ్మ రాజ్యమంటే వేధింపులు, బెదిరింపులా అని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఎమ్మెల్సీ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమిది అని మండిపడ్డారు. యూరియా కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతు లక్ష్మణ్ యాదవ్ నిలదీశాడని పోలీసులు ఇంటికి వెళ్లి వేధింపులకు గురి చేశారు. కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేయడమే ఆలస్యం అన్నట్టుగా పోలీసులు చట్టవ్యతిరేక చర్యలకు దిగుతున్నారు. ఇలాంటి దారుణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.






