- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీరామనవమి రోజున వెల్లివిరిసిన మతసామరస్యం
శ్రీరామనవమి(Sri Ram Navami) పండుగరోజున మతసామరస్యం వెల్లివిరిసింది. భద్రాచలం(Bhadrachalam)లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామనవమి(Sri Ram Navami) పండుగరోజున మతసామరస్యం వెల్లివిరిసింది. భద్రాచలం(Bhadrachalam)లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. వివరాల్లోకి వెళితే.. శ్రీరామనవమి పర్వదినాన దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల దాహం, ఆకలిని తీర్చేందుకు ముస్లింలు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతాజీ యువజన సంఘం, జనతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌జేకే అహ్మద్ మాట్లాడారు.
మత సామరస్యానికి మన దేశం ప్రతీకగా నిలుస్తోందని, ఒకరి మతాన్ని మరొకరు గౌరవిస్తూ పండుగలను కలసికట్టుగా, సుహృద్భావంతో జరుపుకోవడం భారతీయ సంస్కృతిలో భాగమని అన్నారు. శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నేటి యువత కుల, మతాలకు అతీతంగా మతసామరస్యాన్ని పాటిస్తూ, సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. అన్ని పండుగలను కలసికట్టుగా జరుపుకుంటూ, మతసామరస్యాన్ని చాటుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుందామని కోరారు. ఈర్ష్యాద్వేషాలను వదిలిపెట్టి, ఐకమత్యంగా ముందుకు సాగుదామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం సభ్యులు సయ్యద్ అక్బర్, ఓం ప్రకాష్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.






