- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌కు రాఖీ కట్టిన ముస్లిం మహిళ
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR)కు ముస్లిం మహిళ రాఖీ(Rakhi) కట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR)కు ముస్లిం మహిళ రాఖీ(Rakhi) కట్టింది. మస్కట్ దేశంలో చిక్కుకున్న గోదావరిఖని మహిళలను ఇటీవల కేటీఆర్ ఇండియా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కేటీఆర్ లేకపోతే స్వదేశానికి వచ్చేదాన్ని కాదని కంటతడి పెట్టుకొని భావోద్వేగంతో బాధితురాలు కేటీఆర్‌కు రాఖీ కట్టింది. రాఖీ పండుగ అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ఉన్న అమూల్యమైన, పవిత్రమైన సంబంధానికి చిహ్నం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజుని రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీని కడుతుంది. ఈ రాఖీ పండుగను ప్రధానంగా దేశ విదేశాల్లో ఉన్న హిందూ మతస్థులు జరుపుకుంటారు. అయితే.. మతాలకు అతీతంగా ముస్లిం మహిళ కేటీఆర్‌కు రాఖీ కట్టడం ఆసక్తిగా మారింది. దీంతో అక్కడున్న బీఆర్ఎస్ నేతలంతా హర్షం వ్యక్తం చేశారు. వీడియో






