- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్ ఎన్నికల్లో ముస్లింల ఓట్లు గల్లంతు: అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితాలో ముస్లిం ఓటర్ల పేర్ల గల్లంతుపై అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన నగరంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో లక్షలాది మంది ముస్లింల పేర్లను న్యాయపరమైన పరిశీలన జాబితాలో ఉంచడంపై ఆయన ధ్వజమెత్తారు. బరంపూర్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఏకంగా 61.6 శాతం మంది ముస్లిం పేర్లు అడ్జుడికేషన్ లిస్ట్‌లో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా సమ్సేర్‌గంజ్ నియోజకవర్గంలో 55 శాతం ముస్లింల పేర్లపై విచారణ కొనసగుతోందని, మొతాబారి నియోజకవర్గంలో 54.2 శాతం మంది ముస్లింల పేర్లు జాబితాలో నిలిచిపోయాయని అన్నారు. చివరగా మాణిక్ చక్ నియోజకవర్గంలో 50 శాతం మంది ఓటు హక్కు ప్రశ్నార్థకమైందని కామెంట్ చేశారు.
ఓటు వేయలేని స్థితిలో ప్రజలు..
ముస్లిం ఓటర్లందరినీ ఇప్పుడు అడ్జుడికేషన్ లిస్ట్‌లో పెట్టారని.. దీంతో వారు ఓటు వేయలేని స్థితిలో ఉన్నారని అసదుద్దీన్ అన్నారు. ‘ఫారినర్స్ ట్రిబ్యునల్’ (Foreigners Tribunal) వీరిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో తెలియదని.. అప్పటి వరకు వారు ఓటు వేయలేరు స్పష్టం చేశారు. ఎన్నికల లోపే ఫారినర్స్ ట్రిబ్యునల్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని, తద్వారా నిలిచిపోయిన ఓటర్లకు న్యాయం జరుగుతుందని అన్నారు. లక్షలాది మంది పేర్లు గల్లంతయ్యాయని, ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని స్పష్టతనివ్వాలని పేర్కొన్నారు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు అని, ఎన్నికల ముందే విచారణ పూర్తి చేసి అర్హులందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.






