- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి.. ముస్లిం సంఘాల డిమాండ్
బక్రీద్ వేళ ముస్లిం సంఘాలు కీలక డిమాండ్ లేవనెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేయగా నేడు సిరిసిల్లలో ముస్లిం సంఘం నేతలు సైతం అదే డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: బక్రీద్ వేళ ముస్లిం సంఘాలు కీలక డిమాండ్ లేవనెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేయగా నేడు సిరిసిల్లలో ముస్లిం సంఘం నేతలు సైతం అదే డిమాండ్ చేశారు. సిరిసిల్లలో బక్రీద్ పండుగ వేడుకల్లో పాల్గొన్న ముస్లిం సంఘం నేతలు మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో కొన్ని రాజకీయశక్తులు, మతతత్వ శక్తులు కావాలనే రాజకీయ అలజడి రేపాలని చూస్తున్నాయని చెప్పారు. కాబట్టి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.
జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఆవును కొనడం కానీ అమ్మడం కానీ నేరం అని అందరికీ తెలుస్తుందన్నారు. అలా ప్రకటించడం వల్ల ఏ రాజకీయ పార్టీలు, మత తత్వ పార్టీలు దీని ద్వారా లబ్ది పొందడానికి అవకాశం ఉండదన్నారు. తమ మత పెద్దలంతా ఆవును కోయకూడదని నిర్ణయించారని అన్నారు. సిరిసిల్ల ఇంథిజామి మసీద్ కమిటీ ఆధ్వర్యంలో తాము కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రటికంచాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా కమిటీ సభ్యులు దీనికి సంబంధించిన ప్లకార్డులు సైతం ప్రదర్శించారు. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని కాబట్టి






