- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్విట్టర్ ట్రెండింగ్‌లో మూసీ.. కొన్ని గంటల్లోనే 13వేలకు పైగా పోస్టులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ నది పొంగిపొర్లుతున్న సంగతి తెలిసిందే. హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో మూసీనదిలోకి భారీగా వరద నీరు చేరింది. ప్రస్తుతం కాస్త వరద ప్రవాహం తగ్గినప్పటికీ శుక్రవారం, శనివారం మాత్రం మూసీ ఉధృతి కారణంగా వరదనీరు చేరింది.

దిశ, వెబ్ డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ నది పొంగిపొర్లుతున్న సంగతి తెలిసిందే. హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో మూసీనదిలోకి భారీగా వరద నీరు చేరింది. ప్రస్తుతం కాస్త వరద ప్రవాహం తగ్గినప్పటికీ శుక్రవారం, శనివారం మాత్రం మూసీ ఉధృతి కారణంగా వరదనీరు చేరింది. ఎంజీబీఎస్ బస్టాండ్ పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుంది. పురానాపూల్ వద్ద శివాలయం చుట్టూ వరద నీరు చేరింది. చాదర్ ఘాట్ వంతెన సమీపంలో భారీగా నీళ్లు రావడంతో రాకపోకలు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపడుతున్నాయి. అయితే ఎప్పుడూ లేనంతగా మూసీ ఉగ్రరూపం దాల్చడంతో ట్విట్టర్ లోనూ మూసీపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొన్ని గంటల్లోనే మూసీపై దాదాపు 13వేలకు పైగా ట్వీట్లు చేశారు. దీంతో ఈ టాపిక్ ట్రెండింగ్ లోకి వచ్చింది. మూసీ వరదలకు సంబంధించి భయంకర వీడియోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. 1908 తరవాత మళ్లీ అలాంటి వరదలే వచ్చాయని అంటున్నారు.
ఈ క్రమంలో మూసీ సుందరీకరణ చేస్తామంటే బీఆర్ఎస్ అడ్డుకోవడం వల్లనే ఈ పరిస్థితి అని కాంగ్రెస్ సోషల్ మీడియా మండిపడుతోంది. హైడ్రా చర్యల చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు హైడ్రా కేవలం పేదల ఇండ్లనే తొలగించిందని రియల్ ఎస్టేట్ కంపెనీల నిర్మాణాలను తొలగించలేదని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆరోపిస్తుంది. ప్రభుత్వానికి సరైన అవహాహన లేకపోవడంతో ఒకేసారి 15 గేట్లను ఎత్తడం వల్లనే వరదలు వచ్చాయని పోస్టులు పెడుతోంది. వరుస ట్వీట్లతో మూసీ వ్యవహారం నెట్టింట సైతం హాట్ టాపిక్ గా మారింది. దీంతో మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.






