- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: మూసీ డీపీఆర్‌ను మూడు భాషల్లో రిలీజ్ చేయాలి
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌పై సమగ్ర సమీక్ష చేపట్టాలని, ప్రజలను బలవంతపెట్టొద్దని మూసీ జన ఆందోళన్ డిమాండ్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌పై సమగ్ర సమీక్ష చేపట్టాలని, ప్రజలను బలవంతపెట్టొద్దని మూసీ జన ఆందోళన్ డిమాండ్ చేసింది. గురువారం ప్రజాభవన్‌లో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఎంజేఏ ప్రతినిధి బృందం తమ అభ్యంతరాలు, సూచనలు వెల్లడించింది. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీపీఆర్‌ను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో విడుదల చేయాలని.. ప్రజలకు కనీసం 60 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించడం ద్వారా నది శుద్ధి సాధ్యమే అయినప్పటికీ వేలాది కుటుంబాలను బలవంతంగా తరలించడం సరైన మార్గం కాదని ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నదని.. బలవంతపు తరలింపులు ఉండవని ఈ సందర్భంగా భట్టి హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎంజేఏకు చెందిన కార్యకర్త సయ్యద్ బిలాల్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని సంఘం తీవ్రంగా ఖండించింది. చర్చలకు పిలిచి మరుసటి రోజే కార్యకర్తను నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొంది.






