- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Blinkit: ఆన్‍లైన్‍లో కత్తులు కొనుగోలు చేసి హత్యలు.. బ్లింకిట్‍పై కేసు నమోదు
ఢిల్లీ హత్య కేసుల్లో ఉపయోగించిన చాకులు బ్లింకిట్ నుంచి కొనుగోలు చేసినట్లు బయటపడటంతో కంపెనీపై కేసు నమోదు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్‍కు (Blinkit) ఎదురుదెబ్బ తగిలింది. బ్లింకిట్ నుండి కొనుగోలు చేసిన చాకులతో మర్డర్లకు పాల్పడిన కేసులో ఢిల్లీ పోలీసులు ఈ సంస్థపై కేసు నమోదు చేశారు. ఆన్‍లైన్ లో చేసిన ఆర్డర్‍ను డెలివరి చేస్తే కేసు నమోదు చేస్తారా అనే సందేహం కలుగుతోందా? ఇక్కడే అసలు తిరకాసు ఉంది. ఇటీవల ఢిల్లీలో రెండు వేర్వేరు హత్యలు (Delhi Murder) కలకలం రేపాయి. అయితే ఈ రెండు హత్య కేసుల్లో నిందితులు ఉపయోగించిన కత్తులను బ్లింకిట్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలింది.
ఆన్ లైన్ విక్రయాలపై ఆంక్షలు:
నిబంధనల ప్రకారం 7.62 సెంటీమీటర్ల పొడవు, 1.72 సెంటీమీటర్ల వెడల్పు గల బ్లేడ్లు ఉన్న ఫోల్డింగ్ పాకెట్ చాకులు మాత్రమే ఆన్‍లైన్‍లో (Online Knife Sale Rules) విక్రయించాలి. కానీ ఈ హత్య కేసుల్లో నిందితులు ఉపయోగించిన చాకులు 8 సెంటిమీటర్ల పొడవు 2.5 సెంటిమీటర్ల వెడల్పుతో ఉన్నాయి. అయితే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటించకుండా బ్లింకిట్ వీటిని విక్రయించిందని ఆయుధ చట్ట ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బ్లింకిట్ స్టోర్లపై రెయిడ్స్ నిర్వహించి 55 కు పైగా చాకులను స్వాధీనం చేసుకున్నారు.






