- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
John Wesley : సిగాచి కంపెనీపై హత్య కేసు నమోదు చేయాలి : జాన్ వెస్లీ
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులోని పాశమైలారం(Pashamylaram) పారిశ్రామిక వాడలో సిగాచీ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు(Sigachi Explosion) సంభవించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులోని పాశమైలారం(Pashamylaram) పారిశ్రామిక వాడలో సిగాచీ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు(Sigachi Explosion) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 39 మంది మృతి చెందగా, మరో 30 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని సహాయక బృందాలు పేర్కొన్నాయి. కాగా ఈ ఘటనపై సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) స్పందించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని మండిపడ్డారు.
కాలం చెల్లిన, రిపేర్లు కలిగిన రియాక్టర్లను కంపెనీలో ఉపయోగించారని.. అందువల్లే ప్రాణనష్టం ఎక్కువగా ఉందన్నారు. యాజమాన్యం మీద హత్య కేసు నమోదు చేయాలని జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని జాన్ వెస్లీ పేర్కొన్నారు. మరోవైపు సిగాచీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఈనెల 9న రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధం అయింది.






