- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురపోరులో ఆ ప్రాంతమే కీలకం.. కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్ డ్రా పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్ డ్రా పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి. 100కు పైగా మున్సిపాల్టీలు, 7 కార్పోరేషన్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్నది.అందుకోసం మంత్రులకు ఎన్నికల స్ట్రాటజీపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఉత్తర తెలంగాణ లో బలంగా ఉన్న బీజేపీ పార్టీ ఈసారి నిజామాబాద్,కరీంనగర్ కార్పోరేషన్ల తో పాటు 10 మున్సిపాల్టీలో విజయం సాధించాలని ప్లాన్ చేస్తున్నది. అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ తమ ఉనికిని చాటుకునేందుకు మున్సిపాల్టీలకంటే ఓటు శాతంపై ఫోకస్ పెట్టింది.
కాంగ్రెస్ కు తొలి పరీక్ష..
అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ గుర్తులతో జరుగుతోన్న తొలి ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ లీడర్లు చాలెంజ్ గా తీసుకుంటున్నారు. మెజార్టీ అర్బన్ బాడీల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. లేకపోతే అటు పార్టీ, ఇటు ప్రభుత్వంపై పరువు పోతుందనే టెన్షన్ పట్టుకున్నది. అందుకే ఒక్కో లోకసభ నియోజవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్ చార్జిగా నియమించారు. ఆ ఏరియాల్లోని మున్సిపాల్టీలు,కార్పోరేషన్లలో పార్టీ గెలుపుఓటముల బాధ్యతలను సదరు మంత్రులకు అప్పగించారు. ఎన్నికల్లో అనుచరించాల్సిన వ్యూహాలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు వివరిస్తూ, క్షేత్ర స్థాయిలో పార్టీకి సానుకూల వాతవరణం ఉందని పలు సర్వేల నివేధికలను మంత్రులకు అందించారు. అందుకని ఎన్నికలు ముగిసే వరకు సంబంధిత లోకసభ పరిధిలో ఉంటూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారుు. ప్రస్తుతం 116 మున్సిపాల్టీలు,7 కార్పోరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో కనీసం 100 పైగా మున్సిపాల్టీల్లో చైర్మన్ పదవి దక్కించుకునేందుకు కావాల్సిన కార్పొరేటర్లను గెలిపించుకోవాలని టార్గెట్ పెట్టకున్నట్లు తెలిసింది. అలాగే ఎన్నికలు జరుగుతోన్న 7 కార్పోరేషన్లలో మేయర్ పదవిని కాంగ్రెస్ గెలుచుకునేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.
నిజామాబాద్, కరీంనగర్ పై కమలం నజర్
ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న బీజేపీ పార్టీ ఆ ఏరియాలో మెజార్టీ మున్సిపాల్టీలను సొంతం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నది. ప్రధానంగా నిజామాబాద్,కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లు, 10 మున్సిపాల్టీలను కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నది. అందుకోసం కేంద్రమంత్రి బండి సంజయ్ కొన్ని రోజులుగా కరీంనగర్ లో ఉంటూ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం కొనసాగిస్తున్నారు. అలాగే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ సైతం నిజామాబాద్ కార్పోరేషన్ లో విజయం సాధించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. మరోవైపు అదిలాబాద్ ఎంపీ నగేష్ సైతం నియోజకవర్గంలోఉంటూ గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఓటింగ్ శాతంపైనే బీఆర్ఎస్ ఫోకస్
మెజార్టీ మున్సిపాల్టీల్లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ నేతలు పైకీ చెప్తోన్న వాస్తవానికి మాత్రం 5నుంచి 10 మున్సిపాల్టీల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సీట్ల కంటే ఓటింగ్ శాతం పెంచుకోవడంపై ఆ పార్టీ నేతలు ఫోకస్ పెట్టారు. దీనితో రాష్ట్రంలో తమే ప్రత్యామ్నయ పార్టీ అనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే పార్టీ లీడర్లు,కేడర్ లో సైతం ఓరకమైన బూస్టింగ్ గా ఉంటుందని ఆశిస్తున్నారు. అయితే కేసీఆర్,కేటీఆర్,హరీశ్ రావు నియోజకవర్గాల్లోని అన్ని మున్సిపాల్టీల్లో విజయం సాధించడంపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది.
ప్రచారంలోకి రేవంత్, నబీన్
నేటి నుంచి వరసగా 6 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. నేడు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగే పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న తరువాత ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. 5న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6న నిజామాబాద్ జిల్లాలోని రూరల్ లో, 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో, 8న భూపాలపల్లిలో, 9న మెదక్ లో ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోకి కేంద్ర బీజేపీ నాయకత్వం రంగంలోకి దిగింది. నేడు మహబూబ్ నగర్ లో జరిగే ప్రచార సభలో ఆ పార్టీ జాతీయఅధ్యక్షుడు నితిన్ నబీన్ అటెంట్ అవుతున్నారు. అలాగే ఈనెల 8న అదిలాబాద్ లో జరిగే పబ్లిక్ మీటింగ్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేటీఆర్,హరీశ్ రావు అవసరం ఉన్న మున్సిపాల్టీలతో పాటు తమ సొంత నియోజకవర్గాల్లోని మున్సిపాల్టీల్లో ఎన్నికల ప్రచారంచేయాలని భావిస్తున్నారు.






