Priyanka Gandhi: మున్సిపల్ రిజల్ట్స్.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ విషెస్

by Ramesh Naini |

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డంపై ప్రియాంక గాంధీ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి విషెస్ తెలిపారు.

Priyanka Gandhi: మున్సిపల్ రిజల్ట్స్.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ విషెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పైన చ‌ర్చ జ‌రిగింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డంపై ప్రియాంక గాంధీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆమె ప్ర‌త్యేక్యంగా అభినందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి ఘ‌న విజ‌యం క‌ట్ట‌బెట్టార‌ని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీకి తెలియ‌జేశారు.

నిన్న కేంద్ర మంత్రితో..

కాగా, సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. నిన్న (గురువారం) కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. అలాగే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. కృష్ణా - వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్రం నిధులతో చేపట్టాలని కోరారు. హైదరాబాద్ - చెన్నై, హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - పూణే హైస్పీడ్ రైల్ కారిడార్లకు శంషాబాద్ ఏయిర్‌పోర్టు సమీపంలో 500 ఎకరాలు కేటాయిస్తామని రైల్వే మంత్రికి తెలిపారు.

Next Story