పట్టణ సమస్యలకు పరిష్కారాలు చూపండి: మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే. శ్రీదేవి

by Ajay Maddhiboyina |

‘నగరాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారాలు చూపండి. వినూత్న పరిష్కారాలు, నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టండి. మీ ప్రతిపాదనలు పంపించండి’ అని స్టార్టప్ కంపెనీలు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు మున్సిపల్ శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే.శ్రీదేవి పిలుపునిచ్చారు.

పట్టణ సమస్యలకు పరిష్కారాలు చూపండి: మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే. శ్రీదేవి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నగరాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారాలు చూపండి. వినూత్న పరిష్కారాలు, నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టండి. మీ ప్రతిపాదనలు పంపించండి’ అని స్టార్టప్ కంపెనీలు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు మున్సిపల్ శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే.శ్రీదేవి పిలుపునిచ్చారు. అర్బన్ ఇన్నోవేషన్, ఇన్క్యూబేషన్ సెంటర్(యూఐఐసీ), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్(ఎన్ఐయూఎం), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కాలేజ్ విద్యార్థుల కోసం ‘అర్బన్ ఎక్స్ ఛాలెంజ్ ఐడియాథాన్-2026’ను పోస్టర్ ను డీటీసీపీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ భాస్కర్ రెడ్డి, సీడీఎంఏ హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్. అర్బన్ ఇన్నోవేషన్, ఇన్క్యూబేషన్ సెంటర్(యూఐఐసీ) డైరెక్టర్ ప్రశాంతిలతో కలిసి మున్సిపల్ శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే.శ్రీదేవి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మున్సిపల్ శాఖ కార్యదర్శి, ఎన్ఐయూఎం డైరెక్టర్ డాక్టర్ టీకే.శ్రీదేవి మాట్లాడుతూ ఐడియాథాన్ ద్వారా యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి వాస్తవ నగర సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంతోపాటు స్థిరమైన పట్టణాభివృద్ధికి దోహదపడే వినూత్న ఆలోచనలకు మార్గంసుగమం చేయడమే లక్ష్యమని తెలిపారు.

ఆరు థీమ్స్…

సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ విభాగంలో రీసైక్లింగ్, రీయూజ్, రీసోర్స్ రికవరీ వంటి వినూత్న పద్ధతులు, పట్టణ ప్రణాళిక, పట్టణరవాణా, వాతావరణ మార్పులకు ప్రతిస్పందన, నీటి నిర్వహణ, స్మార్ట్ గవర్నెన్స్, సమగ్ర పట్టణాభివృద్ధి వంటి కీలక అంశాలపై వినూత్న ఆలోచనలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈనెల 20వ తేది లోపు అందజేయాలని ఎన్ఐయూఎం అర్బన్ ఇన్ క్యూబేషన్ సెంటర్ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రజెంటేషన్ జూన్ 12,13 తేదీల్లో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ విద్యార్థులు అందజేసిన ప్రతిపాదనలను పరిశీలించడంతోపాటు మెంటారింగ్, నిపుణుల జ్యూరీ ముందు తుది ప్రజెంటేషన్ వంటి దశలు ఉంటాయి. ఎంపికైన జట్లకు పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలు, పట్టణ నిపుణుల నుండి మార్గదర్శకత్వం అందించబడుతుంద తెలిపారు. ఈఐడియాథాన్‌లో విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు, మెంటార్షిప్ అవకాశాలు, ఇన్క్యూబేషన్ సహాయం అందించబడుతుందని తెలిపారు.

Next Story