- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూసీఎఫ్‌లో రూ.14వేల కోట్లు.. సీసీ, బీటీ రోడ్లే కాదు.. ఏ అభివృద్ది పనులకైనా వినియోగం
మున్సిపాలిటీలలో పనిచేయడానికి కేవలం సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కాకుండా అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్(యూసీఎఫ్) కింద సుమారు రూ.14 వేల కోట్ల నిధులున్నాయని, కేంద్ర వికసిత్ భారత్, తెలంగాణా గ్లోబల్ సమిట్ లక్ష్యాలన్నీ కూడా నగరాభివృద్ధి కోసమనే విషయాన్ని మునిసిపాలిటీలలో పనిచేస్తున్న సివిల్ కాంట్రాక్టర్లు మర్చిపోరాదని మున్సిపల్ శాఖ సెక్రెటరీ డాక్టర్ టీకే.శ్రీదేవి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపాలిటీలలో పనిచేయడానికి కేవలం సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కాకుండా అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్(యూసీఎఫ్) కింద సుమారు రూ.14 వేల కోట్ల నిధులున్నాయని, కేంద్ర వికసిత్ భారత్, తెలంగాణా గ్లోబల్ సమిట్ లక్ష్యాలన్నీ కూడా నగరాభివృద్ధి కోసమనే విషయాన్ని మునిసిపాలిటీలలో పనిచేస్తున్న సివిల్ కాంట్రాక్టర్లు మర్చిపోరాదని మున్సిపల్ శాఖ సెక్రెటరీ డాక్టర్ టీకే.శ్రీదేవి అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ అఫ్ అర్బన్ మేనేజిమెంట్(ఎన్ఐయూఎం), ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఇస్కీ) సహకారంతో ఏర్పాటు చేసిన రెండు రోజుల సివిల్ కాంట్రాక్టర్స్ సదస్సు శుక్రవారం ముగిసింది. తెలంగాణలోని వివిధ మున్సిపాలిటీల నుండి వచ్చిన 50 మంది సివిల్ కాంట్రాక్టర్లతో డాక్టర్ శ్రీదేవి ఇస్కీలో సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలలో పనిచేస్తున్న 276 మంది సివిల్ కాంట్రాక్టర్లకు బ్యాచ్ కు 40 మంది చొప్పున ఏడు బ్యాచ్ లలో కాంట్రాక్టలందరికీ పనుల్లో చేపట్టే క్వాలిటీ స్టాండర్డ్స్, ప్లానింగ్, డాక్యుమెంటేషన్, క్వాలిటీ కంట్రోల్, పనుల్లో రక్షణ చర్యలపై నిపుణులు, సీనియర్ అధికారులతో శిక్షణ ఇప్పిస్తున్నామని, మున్సిపాలిటీలలో రూ.15 కోట్లకు, మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.40 కోట్లకు తగ్గకుండా పనులు చేసే అవకాశం ఉందన్నారు. అమృత్, స్వచ్ఛభారత్ మిషన్, నగరాభివృద్ధి,, టీయుఎఫ్ఐడీసీ, అర్బన్ ఛాలెంజింగ్ పథకాల కింద సుమారు రూ.28 వేల కోట్ల నిధులున్నాయని ఒక కొత్త ఐడియాతో, ప్రజలకు ఉపయోగపడే వినూత్నమైన కార్యక్రమాలెన్నో మున్సిపల్ కాంట్రాక్టర్లు చేసే అవకాశం ఉందని వివరించారు. అమృత్ కింద రూ.7 వేల కోట్ల నిధుల్లో రూ.2400 కోట్లు కూడా ఖర్చు కాలేదని, వచ్చే మార్చి నాటికీ ఈ నిధులతో మున్సిపాలిటీల్లో ప్రజలకు ఉపయోగపడే మంచినీరు, సీవరేజి నిర్మాణాలు, పార్కులు, ఫ్లైఓవర్లతో పాటుగా నగర సుందరీకరణ కోసం వర్టికల్ గార్డెన్స్, ఫౌంటెన్ల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులు, ఫ్లై ఓవర్లపై పెయింటింగ్స్ తదితరమైన ఎన్నో చేయవచ్చని డాక్టర్ శ్రీదేవి అన్నారు.
అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్స్ తో వరంగల్ నగరంలో రూ.5200 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు.. పనుల్లో క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండాలని, స్థానికంగా ఉండే లేబర్ కు ఉపాధి కల్పించాలన్నారు. 2047 నాటికీ ప్రభుత్వం ఆశించే మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించాలంటే నగరాభివృద్ధిలో అనేక పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని డాక్టర్ శ్రీదేవి అన్నారు. ఈ సందర్బంగా రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మహమ్మద్ జియావుద్దీన్, మాట్లాడుతూ ఒక కాంట్రాక్టర్, ప్లానర్, ఇంజనీర్, ఎంప్లాయర్, సేఫ్టీ ఆఫీసర్, క్వాలిటీ కంట్రోలర్, ఫైనాన్సియల్ మేనేజర్, సర్వీస్ ప్రొవైడర్ తో పాటుగా కస్టోడియన్ ఆఫ్ పబ్లిక్ అసెట్స్ రూపాల్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ జి. కొండల్ రావు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభంలో ఇస్కీ డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు మాట్లాడుతూ తమ కాలేజీ ద్వారా దేశంలోని అన్ని డిస్కం ఇంజనీర్లతో పాటుగా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ లో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు, జల జీవన్ మిషన్ అధికారులకు శిక్షణ ఇస్తున్నామని, తెలంగాణాలోని మున్సిపల్ కాంట్రాక్టర్లకు కూడా తమ కాలేజీలో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేసినందుకు డాక్టర్ శ్రీదేవికి ధన్యవాదాలు తెలిపారు.






