- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Twist In Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసుకు కొత్త ట్వీస్ట్ గా ముంబై పేలుళ్ల సూత్రధారి రాణా అప్పగింత !?
ముంబై పేలుళ్ల సూత్రధారి(Mumbai Blasts Mastermind) తహవూర్ రాణా(Tahavor Rana)ను ఇండియా(India)కు అప్పగించేందు(Extradition)కు అమెరికా సుప్రీంకోర్టు(US Supreme Court) అనుమతించడం(Allows ) తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు(Telangana Phone Tapping Case)కు కొత్త మలుపు(New Twist) కానుందా..అంటే అవునంటున్నాయి పోలీస్ వర్గాలు.

దిశ, వెబ్ డెస్క్ : ముంబై పేలుళ్ల సూత్రధారి(Mumbai Blasts Mastermind) తహవూర్ రాణా(Tahavor Rana)ను ఇండియా(India)కు అప్పగించేందు(Extradition)కు అమెరికా సుప్రీంకోర్టు(US Supreme Court) అనుమతించడం(Allows ) తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు(Telangana Phone Tapping Case)కు కొత్త మలుపు(New Twist) కానుందా..అంటే అవునంటున్నాయి పోలీస్ వర్గాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో కీలక నిందితుడు అరువుల శ్రవణ్‌లు కేసు నమోదైన వెంటనే అమెరికా పారిపోయారు.
అయితే తాజాగా అమెరికా సుప్రీంకోర్టు ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణాను ఇండియాకు అప్పగించేందు(ఎక్స్‌ట్రడిషన్ )కు నేరస్తుల అప్పగింతలో భాగంగా భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనను అనుమతించడం తెలంగాణ పోలీసులకు వరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పించుకుని అమెరికా పారిపోయిన ప్రభాకర్ రావు, అరువుల శ్రవణ్ లను కూడా ఇండియాకు అప్పగించే విషయంలో రాణా అప్పగింత వ్యవహారం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. వారిద్ధరిని ఇండియాకు రప్పిస్తే ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి రావడానికి ఎంతో కాలం పట్టదని పోలీసు వర్గాలు ధీమాగా ఉన్నాయి. తాజాగా త్రిపుర గవర్నర్, బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించడం సంచలనంగా మారింది.
సూత్రధారుల్లో మొదలైన కలవరం ?
ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణాను ఇండియాకు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు అనుమతించిన అంశం అమెరికాలో దాగిన ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులనే కాకుండా తమ రాజకీయ అవసరాల కోసం ట్యాపింగ్ ను ప్రోత్సహించిన ఆనాటి ప్రభుత్వ పెద్దల్లోనూ, కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ ప్రముఖుల్లోను కలవరం రేపేదిగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెబీ కేంద్రంగా విచ్చలవిడిగా ఫోన్ అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 2023 మార్చి10న కేసు నమోదైంది. ఆ మరుసటి రోజే డీఎస్పీ ప్రణీత్‌రావును అరెస్ట్ చేయడంతో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు.
మార్చి 11నే అమెరికాకు వెళ్లిన ప్రభాకర్‌రావు ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరాలో ఉంటున్నారు. శ్రవణ్‌రావు మార్చి 15న తొలుత లండన్‌కి వెళ్లి అదే నెల 20న అమెరికా చేరుకున్నారు. ఫ్లోరిడాలోని మియామిలో ఉన్నారు. వారిద్దరిని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా చేర్చాక వారి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. తొలుత తాను విచారణకు హాజరవుతానని ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారులను గత ఏడాది జూన్ లో నమ్మించిన ప్రభాకర్ రావు తర్వాత ముఖం చాటేసి అమెరికాలోనే ఉండిపోయాడు. ఆసుపత్రిలోని సోదరి కోలుకున్నాక వస్తానని శ్రవణ్ తెలిపారు.
వారిద్ధరి వీసా గడువు ముగియగా పునరుద్ధరణ కోసం తెలంగాణ రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి దరఖాస్తు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శ్రవణ్‌రావు వీసా గడువు ముగిసినా అమెరికాలో అక్రమ వలసదారుగా ఉంటున్నాడు. పక్కా ప్రణాళికతో ప్రభాకర్‌రావు అమెరికాలోనే గ్రీన్‌కార్డు పొందినట్లు వెల్లడైంది. కానీ పోలీసులు మాత్రం ఆ విషయమై అధికారిక సమాచారం రాలేదని చెబుతున్నారు. వారిద్దరిని హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు గతంలోనే రెడ్‌కార్నర్ నోటీస్ జారీకి కసరత్తు చేశారు. కేంద్ర విదేశాంగశాఖ ద్వారా ఇంటర్ పోల్‌కు సమాచారం పంపారు. ఈ విషయమై విదేశాంగ శాఖలో అప్పీల్ చేశారు.
ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను ఇండియా రప్పించేందుకు తాజాగా ఎక్స్‌ట్రడిషన్ (నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని) ప్రయోగించారు. అమెరికాలో తలదాచుకున్న ఆ ఇద్దరిని అప్పగించాలంటూ ఆ దేశ విదేశాంగ శాఖకి సమాచారమిచ్చే ప్రక్రియను ప్రారంభించారు. సీఐడీ ద్వారా కేంద్ర హోంశాఖకి పోలీసులు నివేదిక పంపించారు. అక్కడి నుంచి విదేశాంగశాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఆ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం గనక ఆ నివేదికను పరిగణనలోకి తీసుకుంటే నిందితులిద్దరిని భారత్‌కు అప్పగించే అవకాశముంది. ఇందుకు ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణాను ఇండియాకు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు అనుమతించడం మరింత సానుకూలంగా కనిపిస్తుంది.






