Alleti Maheshwar Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ ములాఖత్ బట్టబయలైంది: ఏలేటీ మహేశ్వర్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2025-12-31 12:23:57  IST  )

ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల, నల్లమలసాగర్ చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది.

Alleti Maheshwar Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ ములాఖత్ బట్టబయలైంది: ఏలేటీ మహేశ్వర్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ ములాఖత్ బట్టబయలైందని బీజేపీఎల్పీ (BJP)నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) విమర్శించారు. నీటి వివాదంతో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ పరిరక్షణ కోసమే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఏలేటి.. కృష్ణాజలాల్లో చేసిన తప్పులను డైవర్ట్ చేసేందుకే హరీశ్ రావు బనకచర్ల అంశం తెరపైకి తీసుకువచ్చారన్నారు. అసలు బనకచర్లకు (Banakacherla Project) ఎలాంటి అనుమతులు రాలేదని స్పష్టం చేశారు. కాగా నిన్న హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు ఆపలేదని నల్లమలసాగర్ (Nallamala Sagar Project) పేరుతో చేపడుతోందని ఆరోపించారు. నల్లమలసాగర్ కు సీడబ్ల్యూసీ అనుమతులు కూడా ఇచ్చిందని బనకచర్ల కంటే నల్లమలసాగర్ డబుల్ డేంజర్ అని ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం మేల్కోవడం లేదని ఆరోపించారు. అయితే హరీశ్ రావు వ్యఖ్యలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. పోలవరం-నల్లమలసాగర్ ప్రీ ఫీజిబులిటీ రిపోర్టు సీడబ్ల్యూసీ ఆమోదించలేదని ఈ విషయంలో హరీశ్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ ఈ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది.

Next Story