ఎంపీటీసీలకు మంత్రి సీతక్క కీలక హామీ

by Disha Web Desk 2 |
ఎంపీటీసీలకు మంత్రి సీతక్క కీలక హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎంపీటీసీ సంఘం నేతలు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్థాయిలో సరైన గుర్తింపు లేక తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తాము ఎన్నికై నాలుగున్నరేళ్లు గడుస్తున్నా నిధులు, విధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వంలో అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ నిరాశే మిగిలిందన్నారు. వారి విజ్ఞప్తిని విన్న మంత్రి సీతక్క త్వరలోనే రాష్ట్ర కమిటీ సభ్యులతో భేటీ అవుతానని ఎంపీటీసీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.



Next Story