- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీల మాటలు ఫుల్, నిధులు నిల్.. కాంగ్రెస్ ఎంపీ చామల హాట్ కామెంట్స్
తెలంగాణపై కేంద్రం అంతులేని వివక్ష చూపి, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Congress MP Chamala Kiran Kumar Reddy) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణపై కేంద్రం అంతులేని వివక్ష చూపి, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Congress MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. కేంద్ర బడ్జెట్(Union Budjet) పై స్పందిస్తూ.. గాడిద గుడ్డు అనే పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. నయాపైసా కేటాయించకపోవడం బీజేపీ నిర్లక్షానికి నిదర్శనమని, పసుపు బోర్డు(Yellow Board)కు పంగనామం.. ములుగు గిరిజన సెంట్రల్ యునివర్సిటి (Mulugu Tribal Central University)కీ ఎగనామం.. ఈ బడ్జెట్ లో కేటాయింపులు శూన్యం అని మండిపడ్డారు.
అలాగే ఇద్దరు కేంద్ర మంత్రులున్నా స్వరాష్ట్రానికి నిధులు సున్నా అని, ములుగు వర్సిటికి 211 ఎకరాలు అప్పచెప్పినా.. భవనాల నిర్మాణాలను కేంద్రం నిధులు నిల్ అని, విభజన హమీల అమలుకు గుండు సున్నా అని అన్నారు. అంతేగాక ఏపీకి 15 వేల కోట్లు, తెలంగాణకు వట్టి మాటలు అని, ఏపీ వెనకబడిన జిల్లాలకు నిధులు మంజూరు, తెలంగాణకు మొండి చేయి అని తెలిపారు. పోలవరం నిర్మాణానికి వేల కోట్లు, తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టులకు నయా పైసా లేదని, ఏపీకి ఇండస్ట్రీయల్ కారిడార్లు, తెలంగాణకు ప్రోత్సహకాలు కరువు అని దుయ్యబట్టారు. కేంద్ర పన్నుల్లో ఏపీకి రూ. 57 వేల కోట్లు, తెలంగాణకు రూ. 27 వేల కోట్లు మాత్రమేనని, తెలంగాణలో ఐఐటీ, ఐఐఎం, నవోదయ, సైనిక్స్ స్కూల్స్ ఏర్పాటుకు నో అని చెప్పారు.
పన్నుల రూపంలో తెలంగాణ కేంద్రానికి రూపాయి ఇస్తే.. తెలంగాణకు నిధుల రూపంలో తిరిగి వస్తుంది 42 పైసలేనని తెలంగాణకు చెందిన 48 పైసలను తన ఖాతాలో వేసుకుంటున్న కేంద్రం.. తెలంగాణ డిమాండ్లను మాత్రం బుట్టదాఖలు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేశారని, కేంద్రం నుంచి తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు లేవు.. అదనపు ప్రయోజనాలు లేవని తెలిపారు. బీజేపీ ఎంపీలు(BJP MPs), కేంద్ర మంత్రుల(Union Ministers) మాటలు ఫుల్, నిధులు నిల్ అంటూ.. బీజేపీ నేతలు కోతల రాయుల్లు, ఢిల్లీలో మాత్రం మొఖం చెల్లదు అని ఆరోపణలు చేశారు. తెలంగాణ ఓట్లు కావాలి.. కాని తెలంగాణ అభివృద్ది మాత్రం బీజేపీకి పట్టదని, తెలంగాణ ద్రోహి బీజేపీ.. బీజేపీ కో బగావ్, తెలంగాణ కో బచావ్ అని నినాదం ఇచ్చారు.
ఎన్నికల బడ్జెట్.. సామాన్యుల కలలను వంచించిన బడ్జెట్ అని, పంట పెట్టుబడి సహాయం కోసం కిసాన్ సమ్మాన్ యోజన మొత్తాన్ని పెంచుతామని ప్రకటించి.. బడ్జెట్ లో మాత్రం పెంపు ప్రతిపాదన లేదని అన్నారు.60 ఏండ్లు దాటిన రైతులకు నెలవారి పించన్లు అందిస్తామని 6 ఏండ్ల కింద హమీ ఇచ్చిన కేంద్రం.. ఈ ఏడాది బడ్జెట్ లో కూడా పించన్ల ప్రస్తావన చేయలేదని, వ్యవసాయ రంగానికి గత ఏడాదితో పోలిస్తే నాలుగు వేల కోట్లు తగ్గించారని తెలిపారు. ఇక పంటల భీమా పథకాన్ని పాడేనెక్కించేలా నాలుగు వేల కోట్లు తగ్గించారని, యూరియా సబ్సిడీలో వేయి కోట్లు కోత విధించారని చెప్పారు. ఇది సామాన్యుల బడ్జెట్ కాదు.. సంపన్నుల బడ్జెట్ అంటూ.. పేదలను కొట్టి పెద్దలకు పెట్టే బడ్జెట్ అని చామల హాట్ కామెంట్స్ చేశారు.






