- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: మెట్రో రైలు విస్తరణపై ఎంపీలకు అవగాహన
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు సంబంధించి ఎంపీలకు అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిర్వహించింది.

దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు సంబంధించి ఎంపీలకు అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, జీ.వంశీ కృష్ణ, పి.బలరాం నాయక్, కుందూరు రఘువీర్, డాక్టర్ మల్లు రవి, ఆర్.రఘురామ్ రెడ్డి, సురేష్ కుమార్ షెట్కర్, ఎం.అనీల్ కుమార్ యాదవ్, బీజేపీ నుండి ఈటల రాజేందర్, ఎం.రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
రెండో దశ విస్తరణకు సంబంధించి కేంద్రం త్వరితగతిన అనుమతులు మంజూరు చేసేలా రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్టీలకు అతీతంగా కృషి చేయాలని మంత్రులు కోరారు. రెండో దశకు సంబంధించి అంశాలపై అవగాహన కల్పిస్తూ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టుకి సంబంధించి వివిధ సందేహాలను ఆయన నివృతి చేశారు.






