MPHA Results: ఎంపీహెచ్‌ఏ (ఫీమేల్) ఫలితాలు రిలీజ్.. త్వరలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్: మంత్రి

by Ramesh Naini |

ఉద్యోగాల భర్తీలో మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్పీడ్ పెంచిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.

MPHA Results: ఎంపీహెచ్‌ఏ (ఫీమేల్) ఫలితాలు రిలీజ్.. త్వరలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్: మంత్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగాల భర్తీలో మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్పీడ్ పెంచిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు వరసగా విడుదల చేస్తోందని తెలిపారు. పది రోజుల వ్యవధిలోనే 732 ఫార్మాసిస్ట్ (గ్రేడ్-2), 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలను విడుదల చేసిన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. ఈ రోజు ఎంపీహెచ్‌ఏ (ఫీమేల్) పోస్టుల రాత పరీక్ష ఫలితాలను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసినట్లు వెల్లడించారు.

1931 పోస్టులకు గాను, డిసెంబర్ 29న 20,600 మంది అభ్యర్థులు (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పరీక్షలు రాసినట్లు తెలిపారు. బోర్డు వెబ్‌సైట్‌లో మార్కుల జాబితా అందుబాటులో ఉందని, హాల్‌టికెట్, ఇతర వివరాలు ఎంటర్ చేసి మార్కులు చెక్ చేసుకోవాలని బోర్డు సూచించినట్లు వెల్లడించారు. ఇక త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టుకు సంబంధించిన ఫ‌లితాల‌ను మ‌రో వారం రోజుల్లో విడుద‌ల చేసే అవ‌కాశాలు కన్పిస్తున్నాయి.

Next Story