- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎరువుల సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాలి : నడ్డాకు ఎంపీ వద్దిరాజు వినతి
by Muthe.Rajitha |
తెలంగాణలో రోజురోజుకూ తీవ్రమవుతున్న ఎరువుల సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రోజురోజుకూ తీవ్రమవుతున్న ఎరువుల సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. ఎంపీలు గురువారం ఉదయం నడ్డాతో పార్లమెంట్‌లోని ఆయన చాంబరులో భేటీ అయ్యారు. వానలు విస్తారంగా కురిసి వరి నాట్లు పడుతున్న కీలక సమయంలో ఎరువుల కొరత కారణంగా రైతులు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు.
ఖరీఫ్ సీజనులో వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా రైతుల విలువైన కాలమంతా ఎరువుల కోసం క్యూలు కట్టి పడిగాపులు పడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అవసరాలకు సరిపడా ఎరువులను తెలంగాణకు వెంటనే అందేవిధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story






